• Featured post

    GOD OF THIS WORLD

                                                                          GOD OF THIS WORLD Scripture declares that Satan is the ‘god of thi...

    పడద్రోయబడిన సాతాను దేవుని యొద్దకు (పరలోకం) ఎలా వెళ్ళింది ?


    జీవముగల దేవుని క్రీస్తు సంఘ సభ్యులందరికి మరియు  మిత్రులందరికీ  ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో  నా హృదయపూర్వక  వందనములు .





    పైన చూపబడిన whatsapp  మెసేజెస్ ను గమనించే వుంటారు ( ప్రియ మిత్రులు ,సహోదరుడు మంచి ఆలోచనాత్మకమైన ప్రశ్నలు వేశారు? )
    1. పరలోకం లో టైం ప్రకారం మీటింగ్స్ ఉంటాయా ?
    2. పడద్రోయబడిన  సాతాను దేవుని యొద్దకు (పరలోకం) ఎలా వెళ్ళింది ?
    దేవుని యొక్క ఆలోచనలను మరియు అయన కార్యములను మనము అంచనా వేయలేము కానీ , ఆయన మనకు దయ చేసిన పరిశుద్ద గ్రంథమును పరిశీలించిన మనము కొంచము మట్టుకు  ఆయన ఆలోచనలను అర్థము చేసుకొనగలము

    ముందుగా మనము రెండొవ ప్రశ్నకు సమాధాన వెతికినట్లైతే మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

    వాక్య భాగాన్ని ఆలోచించినట్లయితే :­ :

    సాతాను తనకిచ్చిన అధికారమును దుర్వినియోగము చేయదలచి దేవునికి లోబడక తిరగబడి దేవుని ఉగ్రతకు  గురై  ఆయన  యొద్ద నుండి ప్రడద్రోయబడింది .
    యెహెజ్కేలు" 28: 15-18
    15 నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.
    16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.
    17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.
    18 నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.

    యెషయా గ్రంథము-14:12
    తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?

    ఇంకా అనేకమైన సందర్భాలు మనము జీవగ్రంధం నుడి చూడవచ్చు సాతాను ప్రాడదోయబడుట ...

         **ఇక్కడ ప్రశ్న ప్రాడదోయబ్బడ సాతాను దేవుని యొద్దకు పరలోకంలోనికి ఎలా వెళ్ళింది ? యోబు - 1:6 సందర్భం లో చూసినప్పుడు మనకు స్పష్టముగా కనిపిస్తుంది సాతాను భూమిమీదనుండి దేవుని యొద్దకు వెళ్ళింది అని . ఒక సారి ప్రాడదోయబడ్డ సాతాను దేవుని సన్నిధిలోనికి ఎలా ప్రవేశింపగలిగింది ? 

              మరి ఈ ప్రశ్న యొక్క సమాధానం మనకు కావాలి అంటే  మరల మనము బైబిలు గ్రంధాన్ని పరిశీలించాల్సిందే
    ఒకానొక సందర్భం లో దేవుడైన యెహోవా  తన సింహాసనముమీద ఆసీనుడై ఉండుట . పరమండల సైన్యము  ఆయన కుడి ప్రక్కన యెడమా ప్రక్కన నిల్చొని ఉండుట మనము 2 దినవృత్తతముల లో 18 వ అధ్యాయము 18 వ వచనములో  మరియు 1 రాజుల గ్రంధము 22:19  లో కుడా స్పష్టముగా చూడవచ్చు
    అక్కడ ఆ సందర్భం లో ఎం జరుగుతుంది
    మనము ఇక్కడ కొంచము స్పష్టముగా మనసు పెట్టినట్లైతే దేవుడు ఆ యొక్క కూడికలో ఇలా మాట్లాడుతున్నాడు ,ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదుమీదకు పోయి పడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపించును అని అడుగుతున్న  సందర్భం .  
    2 దినవృత్తతము:18:18-21 వరకు ఉన్న సందర్భము చూసినట్లయితే  ఒక ఆత్మ  వచ్చి నేను వెళ్లి ప్రేరేపించుదును అని దేవునికి సమాధానం ఇస్తుంది , అల ఎలా ప్రేరేపిస్తావు అంటే  వారి ప్రవక్తలనోట  అబద్ధములాడు ఆత్మను ప్రవేశ పెడతా అని చెప్తుంది. ఆలా అయితే వెళ్లి నువ్వు ఆ ప్రకారమే చేయుము అని ఆయన సెలవిస్తాడు . ఇక్కడివరకు బాగానే జరిగింది కానీ ...మనము ఒక్కసారి ఈ ఆత్మ  ఎవరు దేవుడు చెప్పకుండా అదే దేవునికి ఇలా చేస్తా అని ఎందుకు చెప్తుంది దేవుడు ఎందుకు దానికి  నీవన్న ప్రకారమే  చేయమని పర్మిషన్ ఇచ్చాడు దేవుడు.

           యోబు గ్రంధం లో చూసినట్లయితే అక్కడ కూడా సాతాను  దేవుని సన్నిధిలోనికి వచ్చింది, ఆ సమయం లో దేవుడు తన దూతలందరితో కూడా మీటింగ్ లో ఉన్నాడు , యోబు గారి గురించిన ప్రస్తావన దేవుడు యోబు గారి గురించి గొప్పగా చెప్తుంటే సాతాను మాత్రం నీవు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తినయడల అతడు నీ ముఖము యెదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని చెప్తుంది (ఒక మనిషి పడటానికి ఎవరు  సలహాలు ఇస్తున్నారు (సాతాను ) పైన దినవృత్తాంతములలో కూడా ఒక ఆత్మ వచ్చి ఒక మనిషి పడిపోవుటకు సలహా ఇస్తుంది అబద్దపు మాటను పుట్టిస్తా అని పర్మిషన్ కావాలి అని సో అక్కడ కూడా మనుషులని పడద్రోయుటకు దేవుడు పెట్టుకునే మీటింగ్స్ లోకి  అపవాదిని అతని అనుచరులని కూడా దేవుడు రమ్మని ఇన్విటేషన్ ఇస్తున్నట్టు చూడొచ్చు ,
           ఇంకా క్లియర్ గ చూడాలి అంటే ప్రకటన గ్రంధం 12:10 మరియు ఒక గొప్ప స్వరము (పరలోకమందు) ఈలాగు చెప్పుట వింటినిఅని యోహాను గారు రాస్తూ,  దివారాత్రములు దేవుని యెదుట మనమీద నేరము మోపువాడైన అపవాది అని వ్రాయబడి ఉన్నది .

          అంటే ప్రతి రోజు దేవుని సన్నిధిలో రాత్రి పగలు దేవుడు అప్పుడు దూతలందరిని మీటింగ్  కి పిలిచినా సాతానుకూడా దూరిపోయి మన మీద నేరారోపణ చేస్తూ మనలని వాడి కోరలకు అప్పగించమని  దేవునికి అర్జీ పెట్టుకుంటుంది ఈ జాబితాలో పేతురు గారు కూడా ఉన్నారు, లూకా -22:31-సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
    32- నీ నమ్మకము  తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.


    పేతురు అంతటి  వాడనే సాతాను వదలలేదు అలాంటిది మనమెంత , పైనున్న ప్రకటన గ్రంధం చూసినట్లయితే  12:10 (పరలోకమందు) అని వ్రాయబడి ఉంది దివారాత్రములు అని ఉంది అండ్ ఇంగ్లీష్ లో (డే అండ్ నైట్ ) దీనిని బట్టి చూసినట్లైతే  ప్రతి రోజు దేవుని సన్నిధి లో (పరలోకమందు) మనగురించి దేవుడు తన దూతలతో (సాతాను మరియు ప్రాడదోయబడ్డ 3వ వంతు అనుచరులతో కూడా) సంభాషిస్తూ ఉంటాడు
    మనలను పరీక్షలోకి తేవటానికి మన గొప్పతనము సాతానుకి చూయించటానికి సాతానును కూడా సభకు పిలిచి మనలను పరీక్షించమని సాతానుకి పర్మిషన్  ఇస్తుంటాడు, ఆ పరీక్షలో నిలిచిన వానికి పరలోకం.
    ప్రశ్న 1-  పరలోకం లో టైం ప్రకారం మీటింగ్స్ ఉంటాయా ?
    జవాబు : జరుగుతుంటాయి
    ప్రశ్న 2-పడద్రోయబడిన  సాతాను దేవుని యొద్దకు (పరలోకం) ఎలా వెళ్ళింది ?
    జవాబు:  తండ్రి  అయిన దేవుడే సాతానుని తన యొద్దకు వచ్చుటకు వీలును కల్పించాడు అని తెలుస్తుంది. కానీ అది ఎంత కాలం వరకు దేవుడు సాతానుని తన సన్నిధిలోనికి రాణించాడు అనేదానికి మరొక బ్లాగ్ లో  వివరిస్తాను.

    అంతవరకు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం లో అందరికి వందనాలు .



    No comments