• Featured post

    GOD OF THIS WORLD

                                                                          GOD OF THIS WORLD Scripture declares that Satan is the ‘god of thi...

    సంఘం లో చీలిక తెచ్చే వ్యక్తులను గుర్తించుట



    నేను దేవుని పరిచర్య మొదలు పెట్టిన మొదటి రోజుల్లో చాల విషయాలు గమనించాను, సంఘము సంఘ భాద్యతలు ఎలా ఉంటుంది అని ఉహించానో దానికి చాల బిన్నంగా ఉండటం గమనించ , సంఘంలో విశ్వాసులలో  ఒకరి మీద ఒకరికి పోరాటాలు , జ్ఞానులుగా భావించి ఖ్యాతి కోసం , గొప్పతనం కోసం సంఘాన్ని వర్గాలుగా విభజించి దేవుని ఆజ్ఞలకు లోబడక సంఘాలను చీల్చి ,వదిలివేయడం చూసాను.
                  కొద్దీ రోజుల పరిచర్యలోనే ఇది అంతా గమనించిన నేను, కొన్ని సంవత్సరాలుగా , దశాబ్దాలుగా దేవుని పరిచర్య చేస్తున్న సంఘ కాపరులు వీటన్నిటిని ఎలా ఎదుర్కుంటున్నారో తెలుసుకోవాలి అనుకున్నాను.
                  నా ఆత్మీయ తండ్రిగారు గత మూడు దశాబ్దాలుగా దేవుని పరిచర్యలో ఉన్నారు, వారిని సమస్యకు  పరిష్కారం ఏమిటి అని అడిగాను. (ఆయన  ఇలా అన్నారు " కొంత మంది విస్వాసులకు సమాధియే సమాధానం" అని)  నిజానికి నాకు ఏమి అర్థం కాలేదు , నా అయోమయాన్ని గమనించిన అయ్యగారు విషయాలు నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు దేవుడ్ని అడగాలి బైబిలు బాగా చదవాలి అని సలహా ఇచ్చారు .
                 ఆయన చెప్పిన మాటలు విని నేను చాలా  రోజులు ఆలోచనలో పడ్డాను...అసలు నేను అడిగిన సమస్యకి  పాస్టర్ గారు చెప్పిన మాటలకి సంబంధం అర్థం కాలేదు..  అయినా సమాధికి వాళ్ళని ఎలా వదిలేస్తారు ఒక ఆత్మాను ఆలా ఎలా వదిలేస్తారు అనుకున్నాను. ఇదంతా ఆలోచించక ఒక్క విషయం  అర్థం అయింది, మనుష్యుల ఆలోచన చొప్పున కాదు కానీ దేవుని ఆలోచనల చొప్పున గ్రహించాలి అని .
                 
    మొదటి  కొరింథీయులకు వ్రాసిన పత్రిక  5: 6,7
     (మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి)
     రోమీయులకు వ్రాసిన పత్రిక  16: 17,18
    (17.సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.)
    పరిశుద్ధ గ్రంధమును చదివిన తరువాత చాల విషయాలకు జవాబులు దొరికాయి. మనం కాస్త ఆలోచించవలసిన విషయం సంఘానికి వ్యతిరేకముగా ఉన్నది ఎవరు ? ఒకరికి
    సంఘాన్ని చీల్చే శక్తి ఉంటుందా? వారు అలాంటి పరిస్థితిలోకి వెళ్లకముందే ఏ లక్షణాలతో వారిని కనిపెట్టగలమని మనకు పరిశుద్ధ గ్రంధము చెప్తుంది.
    ఇటువంటి  వారిలో ముఖ్యంగా 4 లక్షణాలు  కలిగిన వారిని చూడొచ్చు
    1.వ్యతిరేకబుద్ధి :-
                                సంఘంలో మనం ముందుగా ఆహ్వానించటం నేర్చుకొవాలి.  నియమించింది , అభిషేకం ఇచ్చినది దేవుడే , సంఘ కాపరి అంటే నిల్చొని మాటలు చెప్పి వెళ్లిపోయేవాడు కాదు ,  దేవునికి సమర్పించుకొని,  భారంతోప్రతి  సంఘబిడ్డ పై లెక్క అప్పచెప్పవలసిన భారం కలిగి , లోక సుఖాలను వదిలి , విస్వాసులకు మాదిరిరముగా ఉంటూ దేవునికి  ఆరాధనా చేస్తూ , మన అందరికంటే ఎక్కువసమయం దేవునితో గడిపే వ్యక్తి ,  అలంటి వ్యక్తి యెక్క దైవిక  నిర్ణయాలను ఉల్లంఘించి దేవునికి అవమానం కలిగించకూడదు. సంఘములో ఏ కాపరియైన గుంపులుగా వెళ్లి దొమ్మీ చేద్దాము , దొంగతనము చేద్దాము ,అని ఆజ్ఞ ఇస్తారా ? లేక దేవునికి మహిమార్ధంగా పండుగ చేద్దాం, సువార్త చేద్దాం అని చెప్తారా ? మరి అలాంటి ఆజ్ఞలను వ్యతిరేకించటం భావ్యమేనా ? సంఘ కాపరికి  వ్యతిరేకముగా వెళ్లి  దేవుడు నియమించిన కాపరిని కాదంటే దేవునిని అవమానించినట్టే కదా?
    2.లోభి ,గొప్పపోయేవారు :-
                         మన శరీరములో ఉన్న కిడ్నీలు(ఇలా అనుకున్నాయి) నాకు అస్సలు గుర్తింపులేదు. నేను కూడా ముఖం లాగా బయటకు కనబడుతూ అందరి ప్రసంశలు పొందు అనుకుని వీపు బైటకు వచ్చి వ్రేలాడుతున్నాయి అనుకోండి ఎలా ఉంటుంది ?
    సంఘంలో ఇలాంటి  వాళ్ళు ఉండొచ్చు , దేవుడు వారికి దయచేసి  తలాంతును ఉపయోగించకుండా , మనుష్యుల మెప్పు కోసం, దేవుని మెప్పునుకూడా  ప్రక్కకు త్రోసేస్తారు, ఇతరుల మీద నిందలు వేసి వారు గొప్పవారుగా  అనిపించుకుంటారు , జ్ఞానులమని పిలిపించుకొనుటకు ప్రయత్నాలు చేస్తారు.
    మత్తయి సువార్త :- 23: 5,6 & 7.  (మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను ​సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు).
     మరి మంచి సంఘ విశ్వాసి ఎలా ఉండాలి ?
    మత్తయి సువార్త :- 6: 2,5 & 16.
     (2. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.)
    (5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.)
    (16. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.)
    ఈ వేషధారులు సంఘము ఒక్కటిగా ఉండుట కోరుకొనక భీంకములాడుచు ,ఇచ్చకములాడుచు , సంఘములో కలతలు ,అసూయలు, అల్లర్లు పుట్టిస్తూ అబద్ద సాక్ష్యములు పుట్టిస్తూ  క్రీస్తు శరీరమును చీలుస్తూ ఉంటారు.
    కాబట్టి  (యోహాను వ్రాసిన మూడవ పత్రిక :- 1: 11)
    ప్రియుడా, చెడుకార్య మును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.
    3.పిర్యాదు చేయువారు :-
     ఇశ్రాయేలును మోషే ఐగుప్తు దేశము నుండి ,బానిసత్వం నుండి విడిపించి,ఎర్ర సముద్రం దాటించి పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్ని స్తంభముతోనూ కాపాడి, వారిని ఎన్నో అద్భుతాలతో నడిపిస్తే వారు ఐగుప్తు కీరకాయలకోసం మోషేను దేవుడిని తిట్టుకున్నారు , ఇటువంటి వారు ఎన్ని చేసిన ఎదో ఒక లోపము చూపుతుంటారు.
    మన సంఘాలలో మంచి వ్యాకం విత్తబడి ,ఆధ్యాత్మిక చింతనలో సంఘము ముందుకు వెళ్తుంటే , వారు మాత్రం  గుడికి వచ్చి నాకు కుర్చీ దొరకలేదు అనో , ఫ్యాన్ కింద స్థలం లేదు అనో , ఆ కార్యక్రము అవసరమా? ఈ కార్యక్రము అవసరమా? అని అన్ని సాకులు వెతుకుతూ దైవ చింతన లేక  దేవుని  ఘనత కోరక అన్నిటికి అడ్డుచెప్తూ  గడిపేస్తుంటారు, ఇలాంటివారిని మనము సంతోష పెట్టలేము .
    సణుగుటవలన, దేవుని దాసుని మాటలు లక్ష్యపెట్టనందువలన ఇశ్రాయేలీయులు నశించిపోయారు , సంఘంలో ఇలాంటి  వారివాళ్ళ సంఘం పరిస్థితి కూడా అదే.
    4. రెండు తలలు , రెండు నాలుకలు :-
            పైన చెప్పిన మూడు లక్షణాలు గల మనుషులకన్నా వీరిని గుర్తించటం బహు కష్టం కానీ ముఖ్యం.  ఒక మాటమీద ఉండరు , ఒక వైపున ఉండరు, పుండు మీద కారం చల్లుట అంటారు కదా వీరి మాటలు ఆలా ఉంటాయి, డబల్ ఏజెంట్ లాగ  చేస్తారు అన్నమాట, (వీరి మీద వారికి, వారి మీద వీరికి) చాడీలు చెప్తుంటారు , వీరిగురించి దేవుడు బైబిలు లో చెప్తూ
    ప్రకటన గ్రంధము 3: 16:-
                 (నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.)

    యేసు క్రీస్తు మాటలో పరమార్థాలు చాల వేరుగా ఉంటాయి మత్తయి సువార్త 25వ అద్యాయములో మాట్లాడుతూ, ఒక్క నాణము పుచ్చుకున్న వ్యక్తి తనకు తక్కువ  ఉండటం వల్ల శిక్షింపబడలేదు కానీ ఆ నాణెమును  ఉపయోగించనందువల్ల శిక్షింపబడ్డాడు .
    మనకిచ్చిన తలాంతులు దేవునిలో సక్రమంగా వాడి సంఘమును చీల్చకుండా చెరపకుండా ఉండటం మంచిది.
    చివరిగా మత్తయి  12:30 లో దేవుడు ఇలా మాట్లాడుతూ  ( నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.) చెదరగోటు వానిని దేవుడు విసర్జించామని మనకు సూచన చేసి ఉన్నాడు...

    ఇదంతా చూసాక నాకు అర్థం అయినది   " కొంత మంది విస్వాసులకు సమాధియే సమాధానం"  అంటే వారు దేవునికి చేసే విరుద్ధమైన పనుల వలన  దేవునికి దూరం అయిపోతారు అని..  వారిని అనుసరించిన వారి వలన సంఘం వర్గాలుగా మారి చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది   

    కాబట్టి సంఘమా  భయపడకుము ధైర్యము కలిగి ఉండుము . విస్వాసముతో దేవుని ఆజ్ఞలను గైకొని కాపరి నీడలో ముందుకు సాగుము.

    1 comment: